గుంటూరులో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న టిక్ టాక్ ప్రేమ జంట!

  • గత నెలలో పెళ్లి చేసుకున్న శైలజ, పవన్
  • చంపేస్తామని బెదిరించిన శైలజ తల్లిదండ్రులు
  • ఉరి వేసుకుని ఆత్మహత్య
గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బెల్లంకొండ మండలం ఆర్ఆర్ సెంటర్ లో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే మంగళగిరికి చెందిన పవన్ కుమార్, చిత్తూరు జిల్లాకు చెందిన శైలజలకు టిక్ ద్వారా పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అనంతం గత నెల 3న తిరుపతిలో వీరు పెళ్లి చేసుకుని, ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొత్త కాపురాన్ని ప్రారంభించారు. అదే సమయంలో శైలజ తల్లిదండ్రులు ఎంటరై... పవన్ ను వదిలేసి రావాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పటి నుంచి శైలజ ఫోన్ వాడటాన్ని కూడా మానేసింది. అనంతరం పవన్ కు శైలజ బంధువులు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారు.

బెదిరింపులు రావడంతో శైలజ, పవన్ ఇద్దరూ భయపడిపోయారు. కలిసి బతకలేని పరిస్థితి నెలకొందనే బాధలో చనిపోవడానికి సిద్ధమయ్యారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరోవైపు శైలజ సూసైడ్ లెటర్ రాసింది. తమ చావుకు తన తల్లి హేమలత, తండ్రి రవీంద్ర, బంధువు సుబ్రహ్మణ్యం కారణమని లేఖలో పేర్కొంది. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టానికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

TikTok lovers
Sucide
Guntur District

More Telugu News